ఏపీ ఎంసెట్ పూర్తి వివరాలు 3న
Sakshi Education
కాకినాడ: ఏపీలో ఎంసెట్-2015 పరీక్ష మే 10న జరగనుందని, పూర్తి వివరాలను మార్చి 3న వెల్లడిస్తామని ఎంసెట్ నిర్వహణ కమిటీ చైర్మన్, జేఎన్‌టీయూకే ఇన్‌చార్జి వీసీ డాక్టర్ బి.ప్రభాకరరావు తెలిపారు.
మే 10న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ అభ్యర్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు మెడిసిన్ అభ్యర్థులకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు జేఎన్‌టీయూకేలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంసెట్ నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకునేందుకుగాను ఎంసెట్ కమిటీ మార్చి 2న హైదరాబాద్‌లో భేటీకానున్నట్టు ప్రభాకరరావు వెల్లడించారు. ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ ప్రకాష్ తదితరులతో చర్చించాక పూర్తి వివరాలను మార్చి 3న వెల్లడిస్తామన్నారు.
Published date : 28 Feb 2015 12:13PM