Skip to main content

ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎంసెట్-2017 కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 8 నుంచి ప్రారంభం కానుంది.
ఈమేరకు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈనెల 23న జరిగిన అడ్మిషన్ల కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ జీఎస్ పండాదాస్, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు పి.నరసింహారావు, వల్లీకుమారి, కార్యదర్శి వరదరాజన్, సెట్స్ కమిటీ ప్రత్యేకాధికారి రఘునాథ్, వర్సిటీల ప్రతినిధులుగా సుదర్శనరావు (జేఎన్‌టీయూఏ) వెంకటసుబ్బయ్య (ఏయూ), ఆర్‌వీఆర్‌జేసీ, వీఆర్ సిద్ధార్థ కాలేజీల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించి ర్యాంకుల వారీగా తేదీలను జూన్ 1న ప్రకటిస్తామని కన్వీనర్ పండాదాస్ పేర్కొన్నారు. https://apeamcet.nic.in వెబ్‌సైట్లో ఈ వివరాలను పొందు పరుస్తామని తెలిపారు. సర్టిఫికెట్లప రిశీలనకు వచ్చే ముందే అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఏపీ ఎంసెట్ హాల్‌టికెట్, ఆధార్ కార్డు, ఎస్‌ఎస్‌సీ, లేదా తత్సమాన మార్కుల మెమో, ఇంటర్మీడియెట్ మెమో, ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2014 జనవరి 1 తరువాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెలుపు రేషన్‌కార్డు, కులధ్రువీకరణ పత్రం, దివ్యాంగ, ఎన్‌సీసీ, క్రీడలు, మాజీ సైనికోద్యోగుల పిల్లల సంబంధిత ధ్రువపత్రాలు సిద్ధం చేసుకో వాలని సూచించారు. అభ్యర్థులు ఈ ధ్రువపత్రాల ఒరిజినల్ కాపీలను పరిశీలన కేంద్రాల్లో చూపించి అనంతరం అక్కడి అధికారులకు వాటి జిరాక్సు కాపీలను మాత్రమే అందించాలన్నారు. అలాగే ప్రవేశం పొందిన తరువాత కాలేజీలకు కూడా ఒరిజి నల్ ధ్రువపత్రాలను ఇవ్వాల్సిన అవసరం లేదని, కేవలం జిరాక్సు కాపీలు మాత్రమే సమర్పించాలని స్పష్టంచేశారు. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందని, యూజీసీ కూడా ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఒరిజినల్ ధ్రువపత్రాల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులను కూడా ఆన్‌లైన్లో చెల్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ ఎంసెట్ ప్రవేశాల కోసం తెలంగాణ నుంచి కూడా అభ్యర్థులు ఉన్నందున వారి కోసం హైదరాబాద్‌లో ఒక కేంద్రం ఏర్పాటు చేయనున్నామని కన్వీనర్ తెలిపారు.

319 కాలేజీలు... 1.65 లక్షల సీట్లు :
రాష్ట్రంలో 319 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరానికి ప్రవేశాలు నిర్వహిం చనున్నారు. మొత్తం 38 విభాగాల్లో 1,65,793 సీట్లు ఉన్నాయి. ఇందులో 13 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో 4,180 సీట్లు, 306 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,61,613 సీట్లు ఉన్నాయి. ఈసీఈ బ్రాంచ్‌లో అత్యధికంగా 42,165 సీట్లు, కంప్యూటర్ సైన్‌‌సలో 34,557 సీట్లు, మెకానికల్‌లో 30,335, ఈఈఈలో 24,944, సివిల్ ఇంజనీరింగ్‌లో 23,007, ఐటీలో 4,740 సీట్లు ఉన్నాయి. గతేడాది 328 కాలేజీలుండగా ఈ ఏడాది వాటిలో 9 కాలేజీలు తగ్గాయి. అయినా గతేడాదితో పోలిస్తే సీట్ల సంఖ్య పెరగడం విశేషం. ఇంతకు ముందు 1,61461 సీట్లు ఉండగా ఈసారి అదనంగా 4332 పెరిగాయి. గతేడాది 1,61,461 సీట్లలో 88,439 మాత్రమే భర్తీ అయ్యాయి. ఇందులో కన్వీనర్ కోటాలో 84,235 సీట్లు కాగా మిగతా 4,204 సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ అయ్యాయి.

కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలు...

ధ్రువపత్రాల పరిశీలన

: జూన్ 8 నుంచి 17 వరకు

వెబ్ ఆప్షన్ల నమోదు

: జూన్ 11 నుంచి 20 వరకు

ఆప్షన్లలో మార్పులు

: జూన్ 21 నుంచి 22 వరకు

సీట్ల అలాట్‌మెంటు

: జూన్ 25

తరగతుల ప్రారంభం

: జూన్ 29

Published date : 24 May 2017 01:39PM

Photo Stories