ఏపీ ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షకు సూచనలు
Sakshi Education
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా కంగారు పడాల్సిన పని లేదని, నిమిషం నిబంధనకు ఎంసెట్‌లో సడలింపు ఇచ్చినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
సరైన కారణం ఉండి ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతిస్తామ ని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగని అభ్యర్థులు ఆలస్యంగా రావొద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 2017-18 సంవత్సరానికి ఇంజనీ రింగ్, అగ్రికల్చల్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించనున్న ఏపీ ఎంసెట్-17 పరీక్షలు ఈనెల 24 నుంచి ప్రారంభం కాను న్నారుు. మెడిసిన్ కోర్సుల ప్రవేశానికి జాతీయ స్థాయిలో నీట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కేవలం ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి మాత్రమే ఎంసెట్ నిర్వహిస్తున్నారు. ఈనెల 27 వరకూ ఇంజనీరింగ్, 28న అగ్రికల్చర్ విభాగాల్లో పరీక్షలు జరుగుతాయి. ఈసారి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో జిల్లాకు మూడు చొప్పున, అలాగే హైదరాబాద్‌లోని మౌలాలి, నాచారం, హయత్‌నగర్ ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ విభాగంలో ఎంసెట్ రాయాలనుకునేవారి కోసం కర్నూలులో కేంద్రం ఉంది. ఇంజనీరింగ్ విభాగంలో 1,98,068, అగ్రికల్చర్ విభాగంలో 80,725 మంది పరీక్ష రాయనున్నారు.
అభ్యర్థులకు సూచనలు..
పరీక్ష తేదీలు :
ఇంజనీరింగ్ విభాగం: ఏప్రిల్ 24, 25, 26, 27
అగ్రికల్చర్ విభాగం: ఏప్రిల్ 28
సమయం: ఉదయం 10 నుంచి మధ్యహ్నం ఒంటిగంట వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ.
పరీక్ష విధానం..
హెల్ప్‌లైన్ నంబర్లు: 0884-2340535, 2356255
అభ్యర్థులకు సూచనలు..
- విద్యార్థులు ఎంసెట్ హాల్ టికెట్‌తోపాటు, ఎస్సీ, ఎస్టీలైతే కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
- ప్రిన్సిపాల్ లేదా గెజిటెడ్ అధికారి అటెస్ట్ చేసిన దరఖాస్తు ఫారం తీసుకురావాలి.
- హాల్ టికెట్‌పై పేర్కొన్న సమయం, కేంద్రం, తేదీల ప్రకారం పరీక్షకు హాజరుకావాలి. లేకుంటే పరీక్షకు గైర్హాజరైనట్టు పరిగణిస్తారు.
- పెన్ను, పెన్సిల్, రబ్బరు తెచ్చుకోవాలి.
- పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచీలను అనుమతించరు.
- పరీక్షకు ముందు బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల వేలిముద్రలు స్వీకరిస్తారు. వేలిముద్ర వేయడం మరచిపోకూడదు.
- విద్యార్థికి కేటాయించిన కంప్యూటర్‌లో హాల్ టికెట్‌లో ఇచ్చిన యూజర్ ఐడీ, పుట్టిన తేదీ తప్పనిసరిగా పూరించాలి.
- పరీక్ష ముగిసే వరకూ పరీక్ష కేంద్రం నుంచి బయటకు అనుమతించరు. పరీక్ష ఇంగ్లిష్, తెలుగు భాషల్లో మాత్రమే ఉంటుంది.
పరీక్ష తేదీలు :
ఇంజనీరింగ్ విభాగం: ఏప్రిల్ 24, 25, 26, 27
అగ్రికల్చర్ విభాగం: ఏప్రిల్ 28
సమయం: ఉదయం 10 నుంచి మధ్యహ్నం ఒంటిగంట వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ.
పరీక్ష విధానం..
- ఎంపీసీ విద్యార్థులకు గణితం 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులు కలిపి 160 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- బైపీసీ వారికి ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, బోటనీ 40, జువాలజీ 40 కలిపి 160 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- ఎంసెట్ మార్కులు 75 శాతం, ఇంటర్మీడియెట్ 25 శాతం వెయిటేజీగా నిర్ధారిస్తారు.
- ఓసీ, బీసీ అభ్యర్థులకు అర్హత మార్కులు 40 నిర్ధారించగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అర్హత మార్కుల్లేవు.
హెల్ప్‌లైన్ నంబర్లు: 0884-2340535, 2356255
Published date : 24 Apr 2017 12:31PM