Skip to main content

ఏపీ ఎంసెట్‌-2019 ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌-2019 ఫలితాలను విడుదలయ్యాయి.
ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్‌ కార్యదర్శి విజయరాజు జూన్ 4వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తెలుగు రాష్ట్రల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది రాయగా.. 1,35,160 (74.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరకాగా 68, 512 (83.64శాతం) మంది క్యాలీఫై అయినట్లు అధికారులు వెల్లడించారు. పులిశెట్టి రవిశ్రీ తేజ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌లో స్టేట్‌ ర్యాంకు, వేద ప్రణవ్‌ రెండో ర్యాంకు సాధించారు. మెడికల్‌లో సుంకర సాయి స్వాతి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించారు. ర్యాంకుల వివరాలను విద్యార్థుల మొబైల్‌ నంబర్‌, మెయిల్‌కు పంపనున్నట్లు విజయరామరాజు తెలిపారు. ర్యాంకు కార్డులు జూన్‌ 10 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు వెల్లడించారు. కాగా ఏపీ ఎంసెట్‌కు 36,698 మంది తెలంగాణ విద్యార్థులు పరీక్ష రాశారు.

ఇంజనీరింగ్‌ టాప్‌ ర్యాంకర్లు..
  1. కరిశెటి రవి శ్రీతేజ
  2. వేద ప్రణవ్‌
  3. గొర్తి భాను దత్తు
  4. హేథవావ్య
  5. బట్టెపాటి కార్తికేయ
  6. రిషి షర్రష్
  7. సూర్య లిఖిత్‌
  8. అప్పలకొండ అభిజిత్‌ రెడ్డి
  9. ఆర్యన్‌ లద్దా
  10. హేమ వెంటక అభినవ్‌

అగ్రికల్చర్‌, మెడికల్‌ టాప్‌ ర్యాంకర్లు..
  1. సుంకర సాయి స్వాతి
  2. దాసరి కిరణ్‌కుమార్‌ రెడ్డి
  3. అత్యం సాయి ప్రవీణ్‌ గుప్తా
  4. తిప్పరాజు రెడ్డి
  5. జీ మాధురి రెడ్డి
  6. గొంగటి కృష్ణ వంశీ
  7. కంచి జయశ్రీ వైష్ణవీ వర్మ
  8. భీ. సుభిక్ష
  9. కొర్నెపాటి హరిప్రసాద్‌
  10. ఎంపటి కుశ్వంత్‌

ఇంజనీరింగ్‌ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

అగ్రికల్చర్‌, మెడికల్‌ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

మొబైల్‌లో ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి
Published date : 04 Jun 2019 01:20PM

Photo Stories