ఏపీ ఎంసెట్-2019 హాజరయ్యే విద్యార్థులకు సూచనలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్-2019కు దరఖాస్తులు వెల్లువెత్తాయి.
గతంలో కంటే ఈసారి అధికంగా విద్యార్థులు దరఖాస్తు చేశారని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి జరగనున్న ఎంసెట్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎంసెట్‌కు ఇప్పటివరకు 2,82,456 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వీరిలో ఇంజనీరింగ్ విభాగంలో 1,95,625 మంది, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 86,931 మంది ఉన్నారని వెల్లడించారు. రూ.5 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 15 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో దరఖాస్తులు పెరగవచ్చన్నారు. పరీక్షల ఏర్పాట్లు, ఇతర అంశాలపై సాయిబాబు ఏప్రిల్ 13న ‘సాక్షి’తో మాట్లాడారు.
కేటాయించిన తేదీ, స్లాట్‌లోనే పరీక్షకు హాజరు కావాలి :
ఏప్రిల్ 16 నుంచి ఎంసెట్ వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్ వెనుక పరీక్ష కేంద్రం రూట్‌మ్యాప్‌ను కూడా ఇస్తున్నాం. పరీక్ష తేదీ, స్లాట్ సమయాన్ని హాల్‌టికెట్‌లో పొందుపరుస్తాం. హాల్‌టికెట్‌లో ఏ తేదీన ఏ స్లాట్ కేటాయించారో అదే సమయానికి పరీక్షకు విద్యార్థి హాజరు కావాలి. పరీక్ష రోజున ఎవరికై నా ఎన్‌డీఏ, లేదా ఇతర పరీక్షలు ఉంటే.. వారు తగిన ధ్రువపత్రాలు ఎంసెట్ మెయిల్ ఐడీకి పంపిస్తే, వాటిని పరిశీలించి వారికి వేరే తేదీల్లో స్లాట్‌లు కేటాయిస్తాం. స్క్రయిబ్ (సహాయకుని)కు సంబంధించి దరఖాస్తు చేసుకున్నవారు తగిన ధ్రువపత్రాలతో ఎంసెట్ కార్యాలయానికి వచ్చి అనుమతి తీసుకోవాలి.
పారదర్శకంగా పరీక్షల నిర్వహణ:
ఎంసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించడం వల్ల పారదర్శకంగా, త్వరగా ఫలితాలు ప్రకటించొచ్చు. ఆన్‌లైన్ విధానంలో విద్యార్థి తాను గుర్తించిన జవాబుపై సందేహాలు వస్తే ఎన్నిసార్లయినా మార్చుకొని సరైన సమాధానాన్ని మళ్లీ గుర్తించవచ్చు. ఎంసెట్ వెబ్‌సైట్‌లో మాక్ టెస్టుకు అవకాశం కల్పిస్తున్నాం. విద్యార్థులు ఒకరోజు ప్రశ్నపత్రం కష్టం, మరోరోజు సులువు అనే అనుమానాలకు గురై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం సాధారణీకరణ (నార్మలైజేషన్) పద్ధతిలోనే ప్రశ్నపత్రాలు, మూల్యాంకనం ఉంటుంది కాబట్టి ఎవరికీ నష్టం వాటిల్లదు.
ఏప్రిల్ 20 నుంచి 24 వరకు పరీక్షలు :
ఇంజనీరింగ్ పరీక్ష ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీల్లో ఉంటుంది. అగ్రికల్చర్, మెడికల్ పరీక్షను 23, 24 తేదీల్లో నిర్వహిస్తాం. పరీక్ష హాలులోకి కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించం. పరీక్ష పూర్తయ్యాక విద్యార్థి ఈమెయిల్ ఐడీకి ప్రశ్నపత్రం, రెస్పాన్స్ షీట్‌ను పంపిస్తాం. ఈమెయిల్ ఐడీ తప్పుగా ఇచ్చినవారు ఎంసెట్ వెబ్‌సైట్ ద్వారా రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని కేంద్రాలతోపాటు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, నాచారం, సికింద్రాబాద్‌ల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం. ఇంజనీరింగ్ ప్రాథమిక ‘కీ’ని 23న, అగ్రికల్చర్ ప్రాథమిక ‘కీ’ని 24న విడుదల చేస్తాం. ఎంసెట్‌కు సంబంధించి ఇతర సమాచారం కోసం 0884-2340535, 0884-2356255 నెంబర్లకు ఫోన్ చేయొచ్చు.

Published date : 15 Apr 2019 02:14PM