ఏపీ ఎంసెట్-2018 ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఏప్రిల్ 22 నుంచి 25 వరకు నిర్వహించిన ఎంసెట్-2018 ఫలితాలను రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో మే 2న విడుదల చేశారు.
మంత్రి మీడియాతో మాట్లాడుతూ..ఎంసెట్‌లో 72.28% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొత్తం మీద 1,38,017 మంది అర్హత సాధించారని వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంక్‌ను భోగి సూరజ్ కృష్ణ(95.27)సాధించగ, అగ్రికల్చర్, మెడికల్ విభాగం నుంచి జంగాల సాయిప్రియ (94.78)ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంసెట్‌కు 2,76,189 మంది దరఖాస్తు చేయగా ఇంజనీరింగ్ విభాగంలో 1,90,924 మంది; అగ్రి, మెడికల్ విభాగంలో 73,371 మంది పరీక్ష రాశారు.ఏప్రిల్ 25న ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసి 27 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి నివేదికను ఖరారు చేసింది. దీన్ని ఎంసెట్ కమిటీ ఆమోదానికి పంపారు. మార్పులూచేర్పుల అనంతరం తుది ఫలితాలను ర్యాంకులతో సహా మే 2న ప్రకటించారు.
Published date : 02 May 2018 02:25PM