ఏపీ ఎంసెట్-2018 ఫలితాల్లో బాలుర హవా
124 ప్రశ్నలపై 235 అభ్యంతరాలు:
ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్ ప్రాథమిక ‘కీ’ల్లో 124 ప్రశ్నలకు సంబంధించి 235 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని నిపుణుల కమిటీ పరిశీలించి ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా నాలుగు ప్రశ్నలకు మల్టిపుల్ సమాధానాలను సరైనవిగా గుర్తించి మార్కులను కలిపారు. ఇంజనీరింగ్‌లో మొత్తం ఆరు సెషన్లలో 960 ప్రశ్నలు ఇవ్వగా నిపుణుల సలహా మేరకు ఒక ప్రశ్న ఆప్షన్‌ను మార్పు చేశారు. మూడు ప్రశ్నలకు మల్టిపుల్ ఆప్షన్లు ఇచ్చారు. అగ్రికల్చర్ విభాగంలో రెండు సెషన్లలో 320 ప్రశ్నల్లో పరీక్ష నిర్వహించగా నిపుణుల సలహాతో ఒక ప్రశ్నకు మల్టిపుల్ ఆప్షన్లను ఇచ్చారు.
ఇంజనీరింగ్ టాపర్లు వీరే..
ర్యాంకు | అభ్యర్థి | ఎంసెట్ కంబైన్డ్ స్కోర్ |
1. | భోగి సూరజ్‌కృష్ణ | 95.2720 |
2. | గట్టు మైత్రేయ | 94.9302 |
3. | పిన్నమరెడ్డి లోకేశ్వరరెడ్డి | 94.2275 |
4 | జి.వినాయక శ్రీవర్ధన్ | 94.2063 |
5 | మూలింటి షేక్ వాజిద్ | 93.7814 |
6 | బసవరాజు జిష్ణు | 93.5117 |
7. | ఎ.వెంకట ఫణి వంశీనాధ్ | 92.8649 |
8. | సీహెచ్ కేవీఆర్ హేమంత్‌కుమార్ | 92.7156 |
9. | బోడపాటి యజ్ఞేశ్వర్ | 92.6738 |
10. | ముక్కు విష్ణు మనోజ్ఞ | 92.5642 |
అగ్రి, మెడికల్ టాపర్లు వీరే.. | ||
1. | జంగాల సాయి సుప్రియ | 94.7802 |
2 | గంజికుంట శ్రీవాత్సవ్ | 93.2687 |
3. | కోడూరు శ్రీహర్ష | 92.4751 |
4. | గండే ఆదర్శ్ | 92.1226 |
5. | ఎస్.జె.రఫియా కుల్సమ్ | 91.9590 |
6. | ముక్తేవి జయసూర్య | 91.9501 |
7. | ఎన్.వి.విజయకృష్ణ | 91.3196 |
8. | నెల్లి వెంకటసాయి అమృత | 91.2168 |
9. | వీఎన్ తరుణ్‌వర్మ బెల్లంకొండ | 91.1852 |
10. | ఓవీ వెంకటసాయి హర్షవర్థన్‌రెడ్డి | 91.1693 |
ఫలితాల్లో ‘కృష్ణా’ టాప్ :
ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. పరీక్షకు హాజరైనవారిలోనే కాకుండా అర్హత సాధించడంలోనూ ముందు వరుసలో ఉంది. ఇంజనీరింగ్ విభాగంలోనే కాకుండా అగ్రి, మెడికల్ విభాగంలోనూ కృష్ణా జిల్లానే మొదటి స్థానంలో నిలిచింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలపరంగా చూసినప్పుడు తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా పరీక్షలు రాసినవారు, ఉత్తీర్ణులు అత్యధికంగా ఉన్నారు.
ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎంసెట్‌లో హైదరాబాద్ కేంద్రంగా పరీక్ష రాసిన వారే ఎక్కువగా ఉన్నారు. వారిలో ఏపీ విద్యార్థులతో పాటు తెలంగాణ వారూ ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఇంజనీరింగ్‌లో 25410 మంది పరీక్ష రాయగా 21750 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రి మెడికల్ విభాగంలో 10359 మంది పరీక్ష రాయగా 9514 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీలో పరీక్షలు రాసిన వారిలో హాజరు, ఉత్తీర్ణత శాతంలో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉండగా విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది. టాప్ ర్యాంకుల సాధనలోనూ తెలంగాణ విద్యార్థులు ముందు వరుసలో నిలిచారు. ఇంజనీరింగ్ విభాగంలో గట్టు మైత్రేయ 2, జి.వినాయక శ్రీవర్థన్ 4, మూలింటి షేక్ వాజిద్ 5, బసవరాజు జిష్ణు 6, ఏవీ ఫణి వంశీనాధ్ 7, ఎం.విష్ణు మనోజ్ఞ 10వ ర్యాంకును సాధించి మొత్తంగా టాప్ -10లో ఆరు ర్యాంకులు సాధించారు. మెడికల్ విభాగంలో జి.ఆదర్శ్ 4, ముక్తేవి జయసూర్య 6వ ర్యాంకులు దక్కించుకున్నారు.
ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు..
ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎంసెట్‌లో హైదరాబాద్ కేంద్రంగా పరీక్ష రాసిన వారే ఎక్కువగా ఉన్నారు. వారిలో ఏపీ విద్యార్థులతో పాటు తెలంగాణ వారూ ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఇంజనీరింగ్‌లో 25410 మంది పరీక్ష రాయగా 21750 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రి మెడికల్ విభాగంలో 10359 మంది పరీక్ష రాయగా 9514 మంది ఉతీర్ణులయ్యారు. టాప్ ర్యాంకుల సాధనలోనూ తెలంగాణ విద్యార్థులు ముందు వరుసలో నిలిచారు. ఇంజనీరింగ్ విభాగంలో గట్టు మైత్రేయ 2, జి.వినాయక శ్రీవర్థన్ 4, మూలింటి షేక్ వాజిద్ 5, బసవరాజు జిష్ణు 6, ఏవీ ఫణి వంశీనాధ్ 7, ఎం.విష్ణు మనోజ్ఞ 10వ ర్యాంకులను సాధించి మొత్తంగా టాప్ -10 ఆరు ర్యాంకులు సాధించారు. మెడికల్ విభాగంలో జి.ఆదర్శ్ 4, ముక్తేవి జయసూర్య 6వ ర్యాంకులు దక్కించుకున్నారు.
| ఇంజనీరింగ్ | అగ్రి, మెడికల్ | ||
జిల్లా | హాజరు | ఉత్తీర్ణత | హాజరు | ఉత్తీర్ణత |
నంతపురం | 8272 | 5349 | 2934 | 2226 |
చిత్తూరు | 14984 | 10098 | 5834 | 4941 |
తూ.గోదావరి | 15346 | 10696 | 4977 | 4172 |
గుంటూరు | 21752 | 15114 | 9190 | 8228 |
హైదరాబాద్ | 25410 | 21750 | 10359 | 9514 |
కృష్ణా | 25404 | 19394 | 9665 | 9126 |
కర్నూలు | 9660 | 6573 | 6032 | 4972 |
ప్రకాశం | 10297 | 6896 | 3378 | 2849 |
నెల్లూరు | 10883 | 7473 | 4018 | 3622 |
శ్రీకాకుళం | 5441 | 3722 | 1846 | 1515 |
విశాఖపట్నం | 18306 | 13742 | 5701 | 4924 |
విజయనగరం | 4548 | 3136 | 1815 | 1478 |
ప.గోదావరి | 12042 | 8614 | 4251 | 3677 |
వైఎస్సార్ కడప | 8577 | 5460 | 3373 | 2639 |
మొత్తం | 190922 | 138017 | 73373 | 63883 |
ఎంసెట్‌లో ఉత్తీర్ణులైనా.. ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్
పలువురు విద్యార్థులను దురదృష్టం వెంటాడింది. ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ ఇంటర్మీడియెట్‌లో తప్పడంతో ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎంసెట్ అధికారులు వారికి ర్యాంకులు కేటాయించలేదు. ఇంజనీరింగ్ విభాగంలో 1,38,017 మంది అర్హత సాధించగా వారిలో 8,569 మంది ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులు కాలేదు. అగ్రి, మెడికల్ విభాగంలో 63,883 మంది ఉత్తీర్ణత సాధించగా వారిలో 2,668 మంది ఇంటర్మీడియెట్‌లో ఫెయిలయ్యారు. దీంతో వారికి కూడా ర్యాంకులు కేటాయించలేదు. అదేవిధంగా ఇంటర్ బోర్డు నుంచి కాకుండా వేరే బోర్డుల నుంచి ఎంసెట్‌కు హాజరైన 5,497 మంది విద్యార్థులు ఇంటర్ మార్కులను అందించకపోవడంతో వారికి కూడా ర్యాంకులు ప్రకటించలేదు. వారు మార్కులు అందించాక ర్యాంకులు ప్రకటిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు.
టాప్ ర్యాంకర్ల మనోగతాలు :
కంప్యూటర్ ఇంజినీర్ అవుతాను.. ‘మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న కిరాణా వ్యాపారం చేస్తూ నన్ను చదివించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల సహకారం లేకుండా నాలాంటి వారికి ర్యాంకులు రావు. నాకు ర్యాంకు వచ్చిందని అమ్మకు చెప్పే సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. జేఈఈ అడ్వాన్స్ డ్‌కి ప్రిపేర్ అవుతున్నాను. అందులో కూడా మంచి ర్యాంకు సాధిస్తాననే నమ్మకముంది. ముంబై ఐఐటీలో చదివి కంప్యూటర్ ఇంజినీర్ కావాలనేది నా లక్ష్యం’ శ్రీకాకుళంలోని చంపాగళ్ల వీధికి చెందిన సూరజ్‌కృష్ణ చెప్పారు. - భోగి సూరజ్ కృష్ణ(ఇంజినీరింగ్ ఫస్ట్) |
ముంబై ఐఐటీలో చదువుతాను.. ‘జేఈఈ మెయిన్స్, ఏపీ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్‌లు రావడం ఆనందంగా ఉంది. జేఈఈ అడ్వాన్స్ డ్‌లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి ముంబై ఐఐటీలో చేరాలనుకుంటున్నాను. కుటుంబసభ్యుల సహకారంతో ప్రణాళికబద్ధంగా చదవడం వల్లనే ఇదంతా సాధ్యమైంది’ అని హైదరాబాద్‌కు చెందిన గట్టు మైత్రేయ చెప్పారు. అదానీ గ్రూప్‌లో విధులు నిర్వహించే మైత్రేయ తండ్రి రాంబావ్.. పిల్లల చదువుల నిమిత్తం చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. - గట్టు మైత్రేయ(ఇంజినీరింగ్‌లో రెండో ర్యాంక్) |
సీఈవో అవుతాను.. ‘కంప్యూటర్ సైన్స్ చదివిప్రముఖ కంపెనీలకు సీఈవో కావాలనుకుంటున్నాను’ అని బద్వేలుకు చెందిన పి.లోకేశ్వర్‌రెడ్డి తెలిపారు. జేఈఈ మెయిన్స్ లో 15వ ర్యాంక్ సాధించానని.. అడ్వాన్స్ డ్‌లో కూడా సత్తా చాటుతానన్నారు. తల్లిదండ్రులు కొండారెడ్డి, వెంకటసుబ్బమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూనే పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె సుదీప్తి జర్మనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, రెండో కుమార్తె సుజన రిమ్స్‌లో దంతవైద్య విద్యను అభ్యశిస్తున్నారు. - పి.లోకేశ్వర్‌రెడ్డి (ఇంజినీరింగ్‌లో మూడో ర్యాంక్) |
న్యూరాలజిస్ట్ అవుతాను.. ‘న్యూరాలజిస్ట్ అవ్వాలనేది నా లక్ష్యం. మా బంధువు ఒకరు న్యూరాలజిస్టు సమస్యతో చనిపోయారు. అప్పుడే నేను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను. నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాను. అందులో అత్యుత్తమ ర్యాంక్ సాధించి మెడిసిన్ చేస్తా. నేను చదివిన చదువు.. ప్రజలకు ఉపయోగపడాలి. మా అన్నయ్య సాయివిహార్ సలహాలు, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల సూచనలు నా ర్యాంక్‌కు కారణం’ అని విశాఖలోని దొండపర్తికి చెందిన జనగాల సాయి సుప్రియ పేర్కొంది. - జనగాల సాయిసుప్రియ (అగ్రి, మెడికల్‌లో స్టేట్ ఫస్ట్) |
చాలా ఆనందంగా ఉంది.. ‘మా అబ్బాయి శ్రీవాత్సవ్ చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడు. బాగా చదివేవాడు. నీట్‌లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి డాక్టర్ అవ్వడమే శ్రీవాత్సవ్ లక్ష్యం’ అని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అతని తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, సీతారామ్ తెలిపారు. తమ కుమారుడికి సెకండ్ ర్యాంక్ రావడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీవాత్సవ్ హైదరాబాద్‌లో నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాడని తెలిపారు. - అగ్రి, మెడికల్ సెకండ్ ర్యాంకర్ గంజికుంట శ్రీవాత్సవ్ తల్లిదండ్రులు |
నాన్న కల నెరవేరుస్తాను.. ‘అమ్మా, నాన్న ఇద్దరూ వెటర్నరీ డాక్టర్లు. నాన్న కల నెరవేర్చాలన్నది నా సంకల్పం. ఆయన డాక్టర్ కావాలనుకున్నారు.. కానీ అప్పట్లో ఆయనకు వచ్చిన ర్యాంకు వల్ల అది సాధ్యం కాలేదు. నేను కచ్చితంగా డాక్టర్ అవుతాను. అందుకోసం ఎంత కష్టమైనా పడతాను. నీట్‌కు సన్నద్ధమవుతున్నాను. మంచి ర్యాంక్ సాధించి కార్డియాలజిస్టు అవుతాను’ అని విజయవాడలోని పడమటలంకకు చెందిన శ్రీహర్ష తెలిపారు. - శ్రీ హర్ష(అగ్రి, మెడికల్ మూడో ర్యాంక్) |
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం.. ‘ఎంసెట్ రోజు అనారోగ్యంతో బాధపడుతూ కూడా అలాగే వెళ్లి పరీక్ష రాశాను. టాప్ టెన్‌లో ఉంటానని ఊహించలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విజయం సాధించాను. నీట్ రాసి.. భవిష్యత్‌లో మంచి వైద్యురాలిగా సేవలందిస్తా’ అని కదిరికి చెందిన షేక్ జానూభాయ్ రఫియా కుల్సమ్ పేర్కొంది. కాగా, తండ్రి రియాజ్ మంచాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. తల్లి కౌసర్ గృహిణి. కుమార్తెకు మంచి ర్యాంక్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. -షేక్ రఫియా కుల్సమ్(అగ్రి, మెడికల్ ఐదో ర్యాంక్) |
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. ‘అకడమిక్ ప్రోగాం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే టాప్ ర్యాంక్ సాధించగలిగాను. ప్రస్తుతం నీట్‌కు సన్నద్ధమవుతున్నాను. అందులో కూడా మంచి ర్యాంక్ సాధించి గుంటూరు మెడికల్ కాలేజీలో చేరుతాను..’ అని గుంటూరుకు చెందిన నల్లూరి వెంకట విజయ్‌కృష్ణ చెప్పారు. అతని తండ్రి డాక్టర్ మురళీకృష్ణ గుంటూరు మెడికల్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్‌గా బాధ్యత నిర్వర్తిస్తుండగా.. తల్లి విజయశ్రీ జీజీహెచ్‌లో మెడికల్ స్టోర్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. - ఎన్.విజయ్‌కృష్ణ (అగ్రి, మెడికల్ ఏడో ర్యాంక్) |