ఏపీ ఎంసెట్-2018 పాథమిక ‘కీ ’ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభమైన ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలు 25 తో ముగిశాయి.
ఇంజనీరింగ్ విభాగానికి 3 రోజులు, అగ్రి, మెడికల్ విభాగానికి ఒక రోజు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 2,64,295 మంది హాజరైనట్లు కన్వీనర్ సీహెచ్ సాయిబాబు ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ ని ఏప్రిల్ 25 రాత్రి ఎంసెట్ వైబ్‌సైట్లో పొందుపరిచారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఏప్రిల్ 27వ తేదీ వరకు స్వీకరించనున్నట్టు తెలిపారు. మే 3వ తేదీన ఎంసెట్ తుది ఫలితాలను విడుదల చేయన్నుట్టు సాయిబాబు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 0884-2340535, 0884-2356255 నంబర్లను లేదా apeamcet18 @gmail. com ను సంప్రదించవచ్చన్నారు.
ఏపీ ఎంసెట్-2018 ‘కీ ’కోసం క్లిక్ చేయండి
ఏపీ ఎంసెట్-2018 ‘కీ ’కోసం క్లిక్ చేయండి
Published date : 26 Apr 2018 02:42PM