ఏపీ ఎంసెట్-2017 సన్నద్ధతకు ఆన్‌లైన్ మాక్ టెస్ట్
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి తొలిసారిగా ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు ప్రారంభించింది.
ఆన్‌లైన్ విధానంలో ఎంసెట్-2017 ప్రవేశపరీక్షను ఎలా రాయాలో తెలిపే సవివర విషయ సూచికతోపాటు ఆన్‌లైన్ మాక్‌టెస్టును కూడా ‘ www.sche.ap.gov.in/eamcet ’ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్. ఘునాధ్ తెలిపారు. ఏపీ ఎంసెట్-2017కు ఈనెల 9వ తేదీనుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 15 వరకు 12,492 దరఖాస్తులు అందాయి. ఇందులో ఇంజనీరింగ్ విభాగంలో 6637, బైపీసీ విభాగంలో 5761, రెండు విభాగాలకు కలిపి 94 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి మెడికల్ విభాగానికి సంబంధించిన ఎంబీబీఎస్, డెంటల్ కోర్సులకు నీట్ పరీక్షను జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌తో సమానంగా బైపీసీ స్ట్రీమ్ నుంచి దరఖాస్తులు అందడం విశేషం. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 23వరకు గడువు నిర్దేశించారు.
18నుంచి లాసెట్, 22నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తులు
లాసెట్ దరఖాస్తులను ఈనెల 18 నుంచి ఆన్‌లైన్లో స్వీకరించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ ప్రవేశపరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఈనెల 22వ తేదీ నుంచి స్వీకరించనున్నారు.

Published date : 17 Feb 2017 02:54PM