ఎంసెట్‌లో మిగిలిన ర్యాంకులు విడుదల
Sakshi Education
కాకినాడ: ఏపీ ఎంసెట్‌లో అర్హత సాధించి ర్యాంకులు పొందని అభ్యర్థులకు ఈనెల 2న ర్యాంకులు ప్రకటించనున్నట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా కాకుండా ఇతర బోర్డులు ద్వారా ఎంసెట్ పరీక్ష రాసి డిక్లరేషన్ ఫారం ఎంసెట్ కార్యాలయానికి అందజేసిన వారి ర్యాంకులు ప్రకటిస్తామని, ఇంకా డిక్లరేషన్ ఫారం సమర్పించని అభ్యర్థులు ఫారం ఎంసెట్ వైబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని అందజేస్తే ర్యాంకులు వెల్లడిస్తామన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష హాల్ టికెట్ నంబరు కాకుండా ప్రథమ సంవత్సరానిది ఎంటర్ చేయడంతో ఈ సమస్యలు వచ్చాయని తెలిపారు. ఏమైనా సందేహలుంటే 0884-2340535 నెంబరుకు సంప్రదించవచ్చన్నారు.
Published date : 02 Jun 2017 02:32PM