ఎంసెట్‌లో అర్హత సాధిస్తేనే రీయింబర్స్‌మెంట్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మైనార్టీ విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించాలంటే ఎంసెట్‌లో అర్హత సాధించాల్సిందేనని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంసెట్‌లో అర్హత సాధించకుండా ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించడం లేదని కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపించి నిబంధనలు పరిశీలించినట్లు ఆయన తెలిపారు.
Published date : 07 Jan 2016 12:39PM