Skip to main content

ఎంసెట్‌లో 82,925 మంది ఆప్షన్ల నమోదు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2020 అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో జనవరి 1 తేదీన సాయంత్రానికి 82,925 మంది ఆప్షన్లు నమోదు చేసినట్లు కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జనవరి 1న అభ్యర్థులు తమ ఆప్షన్లు సవరణ చేసుకోవడంతో పాటు కొత్తగా మరికొంతమంది సర్టిఫికెట్ల పరిశీలన, ఆప్షన్ల నమోదు చేశారు. 3వ తేదీ సాయంత్రం అభ్యర్థులకు ర్యాంకు, రిజర్వేషన్లు అనుసరించి ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించనున్నారు.

ఆప్షన్ల నమోదు వివరాలు ఇలా
:

ఎంసెట్‌లో అర్హత సాధించిన వారు:

1,29,714

సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొన్న వారు:

90,076

ఆప్షన్ల నమోదుకు అర్హులు:

89,078

శుక్రవారం ఆప్షన్లు నమోదు చేసిన వారు:

13,012

మొత్తం నమోదైన ఆప్షన్లు:

82,925

Published date : 02 Jan 2021 04:43PM

Photo Stories