ఎంసెట్‌లో 57 శాతం సీట్లే భర్తీ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్-2019 తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 23తో ముగిసింది. మొత్తం 57 శాతం సీట్ల కేటాయింపు పూర్తయింది.
ఎంసెట్‌లో 1,32,997 మంది అర్హత సాధించగా.. 68,658 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వీరిలో 68,071 మంది అర్హులుగా నిలిచారు. తుది విడతలో 18,388 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఈ సారి కన్వీనర్ కోటా కింద 1,06,203 సీట్లుండగా.. తుది విడత కేటాయింపుతో కలుపుకొని మొత్తం 60,315 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 45,888 సీట్లు మిగిలున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 9,580 మంది అర్హులుండగా.. వీరిలో 4,784 మంది వెబ్ అప్షన్లు ఇచ్చారు. ఈ కోటాలో 9,566 సీట్లుండగా 4,092 కేటాయించారు. సీట్ల కేటాయింపు అయిన అభ్యర్థులు ఆగస్టు 27లోగా సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు.. ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని కన్వీనర్ పేర్కొన్నారు.
9 కాలేజీల్లో ఒక్క సీటూ భర్తీ కాలేదు
ఈసారి ఎంసెట్‌లో ఒక్క సీటూ భర్తీకాని కాలేజీలు తొమ్మిది ఉన్నాయి. ఆకుల శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, భరత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, చదలవాడ వెంకటసుబ్బయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, శ్రీ చైతన్య డీజేఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గోకుల్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్, హెచ్‌ఎంకేఎస్ అండ్ ఎంజీఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ప్రియదర్శిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ రాఘవేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ సైన్స్ కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు.
17 కాలేజీల్లో పూర్తి సీట్ల భర్తీ..
ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సుకు అగ్రతాంబూలం దక్కింది. సీఎస్‌ఈలో 23,241 సీట్లుండగా 19,319, ఈసీఈలో 25,960 ఉండగా 17,887 సీట్లు భర్తీ అయ్యాయి.

Published date : 24 Aug 2019 01:30PM