Skip to main content

ఎంసెట్‌లో 1.66 లక్షల సీట్లు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు 2018-19 విద్యా సంవత్సరానికిగాను 1.66,373 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ మేరకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతులు మంజూరు చేసింది. గతేడాదికన్నా(2017) ఈ ఏడాది(2018) 13,640 సీట్లు తగ్గాయి. కొన్ని కాలేజీలు మూత, మరికొన్ని కళాశాలు సీట్లు భర్తీకాని కోర్సులను రద్దు చేసుకోవడమే ఈ సీట్ల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. ఏఐసీటీఈ గతేడాది రాష్ట్రంలోని 430 కాలేజీలకుగాను 1,80,013 సీట్లకు అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది 24 కాలేజీలు మూతకు దరఖాస్తు చేసుకోవడంతో కాలేజీల సంఖ్య 406కి తగ్గింది. కొన్ని కాలేజీలు కోర్సుల రద్దుకూ దరఖాస్తు చేయడంతో ఆమేరకు కూడా సీట్లకు కోతపడింది. కాలేజీలకు, సీట్లకు ఏఐసీటీఈ అనుమతులు రావడంతో అధికారులు కౌన్సెలింగ్‌కు ఎన్‌ఐసీ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 26నుంచి కౌన్సెలింగ్ చేపడతామని ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తూ మంత్రి గంటా ప్రకటించిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ అనంతరం జూన్ 11 నుంచి తరగతులు కూడా ప్రారంభించనున్నారు.

కేటగిరీ

వర్సిటీ

ప్రైవేట్

మొత్తం

ఇంజనీరింగ్

14

288

150368

ఫార్మా

6

113

10565

డీమ్డ్ ప్రైవేట్ ఇంజనీరింగ్

-

2

5320

డీమ్డ్ ప్రైవేట్ ఫార్మా

-

2

120

సెకండ్ టెర్మ్ డెరైక్టు

-

1

-

మొత్తం

20

406

166373

Published date : 09 May 2018 05:38PM

Photo Stories