ఎంసెట్‌కు దరఖాస్తులు 2 లక్షలకుపైగానే ...
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌కు మార్చి 24 నాటికి రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
ఇంజనీరింగ్ కోర్సులకు 1,41,408 దరఖాస్తులు అందాయి. అగ్రికల్చర్, తదితర కోర్సులకు 58,680 దరఖాస్తులు వచ్చాయి. ఇక రెండింటికీ కలిపి 800 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికార వర్గాలు వివరించాయి. అపరాధ రుసుం లేకుండా మార్చి 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలంటే నిర్దేశిత అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
ధ్రువపత్రాల పరిశీలన ఆన్‌లైన్లోనే..
కాగా, ఈసారి దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ధ్రువపత్రాల పరిశీలనను ఆన్‌లైన్లో నిర్వహించేలా ఎంసెట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ధ్రువపత్రాలను జారీ చేసే సంస్థల నుంచి సమీకరించి వాటిని తమ వెబ్‌సైట్ ద్వారా పరిశీలనకు వీలుగా అనుసంధానం చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు.

Published date : 26 Mar 2018 02:15PM