ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ పారంభం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్-2017 రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
జూలై 20, 21, 22 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. వెబ్ ఆప్షన్లను కూడా అభ్యర్థులు జూలై 20 నుంచి 22వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు. జూలై 24న సీట్ల కేటాయింపు చేస్తారు. మొదటి విడతలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాని వారు కూడా రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ పండాదాస్ తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొంది, కాలేజీ, కోర్సు మార్పు కోరుకొనే అభ్యర్థులు రెండో విడత కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. రాష్ట్రంలో 313 ఇంజనీరింగ్, 120 ఫార్మా కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 98,882 సీట్లున్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు, కాలేజీల్లో చేరికల తర్వాత కూడా యూనివర్సిటీ కాలేజీల్లో 1,174 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో 36,804 సీట్లు ఖాళీగా ఉన్నాయని కన్వీనర్ వివరించారు.
Published date : 20 Jul 2017 01:37PM