Skip to main content

ఎంసెట్ ఫాంపై అటెస్టేషన్ తప్పనిసరికాదు: ఎంసెట్ కమిటీ

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ దరఖాస్తు పత్రంపై అటెస్టేషన్(గెజిటెడ్ ఆఫీసర్/విద్యార్థి చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం) తప్పనిసరి కాదని ఎంసెట్ కమిటీ పేర్కొంది. ఈ మేరకు సవరణ నోటిఫికేషన్‌ను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది.
కాగా, ఈ నెల 9 నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి హాల్‌టికెట్లు జారీ చేస్తోంది. వీటిలో ఎంసెట్ ఫాంను కచ్చితంగా అటెస్టేషన్ చేయించాలనే నిబంధన ఉంది. ఆన్‌లైన్‌లో ఫిల్ చేసిన దరఖాస్తు పత్రంపై విద్యార్థి ఫొటో అతికించి, దానిపై గెజిటెడ్ సంతకం చేయించి, విద్యార్థి తన వేలిముద్ర వేయాలని, అనంతరం పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ ముందు సంతకం చేసి అందజేయాలని అందులో పేర్కొంది. దీంతో ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఈ నిబంధన వల్ల విద్యార్థులు కొంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎంసెట్ అధికారులకు ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గెజిటెడ్ ఆఫీసర్/ప్రిన్సిపాల్ సంతకం తప్పనిసరి కాదని ఎంసెట్ కమిటీ పేర్కొంది. ఈ మేరకు విషయాన్ని తమ వెబ్‌సైట్ అప్‌డేట్స్ కేటగిరీలో పొందుపరిచింది. కాగా, ఈ నెల 28, 29న జరగనున్న అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను ఈ నెల 21 నుంచి 25లోగా తమ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కమిటీ వివరించింది.
Published date : 07 Sep 2020 03:53PM

Photo Stories