ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ఈ నెల 6, 7 తేదీల్లో జరుగనుందని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి మంగళవారం నోటిఫికేషన్ జారీచేశారు.
మొదటి రెండు విడతల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోని వారు ఈనెల 6 వ తేదీన ఆయా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో పరిశీలన చేయించుకోవాలని సూచించారు. ఆగస్టు ఏడో తేదీ సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లకు గడువు ఉంటుందన్నారు. అన్ని ర్యాంకుల అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సులకు సంబంధించి మొదటి రెండు విడతల్లో మిగిలిన సీట్ల కోసం మూడో విడత కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు వివరించారు. వెబ్ ఆప్షన్ల అనంతరం ఈనెల 9వ తేదీన అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.
Published date : 03 Aug 2016 02:33PM