ఎంసెట్, జేఈఈ, నీట్ వీడియో పాఠాలు ప్రతిరోజూ ఉచితంగా...
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, జేఈఈ, నీట్ కోసం సిద్ధమయ్యే విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌లో (tsbie.cgg.gov.in) వీడియో పాఠాలను అందుబాటులో ఉంచినట్లు తెలంగాణ పభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఏప్రిల్ 16న ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు ప్రతి రోజూ చదువుకునే పాఠాలపై ఆ మరుసటిరోజు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలను ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రోజూ పరీక్షలే కాకుండా వారానికోసారి, నెలకోసారి పరీక్షలు కూడా ఉంటాయని వెల్లడించారు. ప్రభుత్వ, సంక్షేమ శాఖల విద్యార్థులే కాకుండా ఇతర విద్యార్థులు కూడా వాటిని చదువుకోవచ్చన్నారు. ప్రతి పాఠానికి సంబంధించి 40 ప్రశ్నలతో పరీక్ష ఉంటుందని, సబ్జెక్టుకు సంబంధించి 160 ప్రశ్నలతో పరీక్షలు ఉంటాయని వివరించారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రతి రోజు నిర్వహించే పరీక్షలకు సంబంధించి షెడ్యూలును మే 4వ తేదీ వరకు జారీ చేశామని, మిగతావి తరువాత ప్రకటిస్తామని వివరించారు. ఈ పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 9299995866 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చని వివరించారు. ఈ వీడియో పాఠాలు, టెస్టుల కోసం విద్యార్థులు తమ వెబ్‌సైట్‌లో ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చని వివరించారు.
Published date : 17 Apr 2020 01:53PM