Skip to main content

ఎంసెట్ దరఖాస్తులో ‘ఈడబ్ల్యూఎస్’ నంబర్ తప్పనిసరి కాదు...

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్-2020 ఆన్‌లైన్ దరఖాస్తులో ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కేటగిరీ అభ్యర్థులు ధ్రువపత్రం నంబర్‌ను నమోదు చేయడం తప్పనిసరి కాదని సెట్స్ ప్రత్యేకాధికారి ఎం.సుధీర్‌రెడ్డి సాక్షితో తెలిపారు.
ఏపీ ఎంసెట్ ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, మెటీరియల్, గెడైన్స్.. ఇతర ఆప్‌డేట్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  • అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకొని ఉంటే ఆన్‌లైన్ దరఖాస్తులో ‘ఎస్’ అని టిక్ చేసి నంబర్‌ను నమోదు చేయవచ్చు.
  • సర్టిఫికెట్లు అందుబాటులో లేని అభ్యర్థులు ‘ఎస్’ అని టిక్ చేస్తే సరిపోతుంది. నంబర్ నమోదు కేవలం ఆప్షన్ మాత్రమే.
  • ఇటువంటి అభ్యర్థులు అడ్మిషన్ల కౌన్సెలింగ్ సమయంలో తమ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పరిశీలనకు చూపించాల్సి ఉంటుంది.
  • ఈడబ్ల్యూఎస్ కోటాకు చెందిన పలువురు అభ్యర్థుల నుంచి అందిన విన్నపాల మేరకు ఈ మార్పులు చేశాం.
  • ఎంసెట్‌కు ఇప్పటి వరకు 1,41,491 దరఖాస్తులు అందాయి. వీటిలో 58 వేల దరఖాస్తులు మెడికల్ కాగా తక్కినవి ఇంజనీరింగ్ విభాగానికి అందాయి.

వివిధ సెట్లకు దరఖాస్తులు ఇలా ఉన్నాయి.

ఎంసెట్

1,41,491

ఈసెట్

22,318

ఐసెట్

21,974

పీజీసెట్

2,649

లాసెట్

2,208

ఎడ్‌సెట్

930

పీఈసెట్

377

Published date : 21 Mar 2020 03:00PM

Photo Stories