ఎంసెట్ బైపీసీలో 7242 సీట్లు భర్తీ
Sakshi Education
ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్వహించిన ఎంసెట్(బైపీసీ స్టీమ్) తొలి విడత కౌన్సెలింగ్ శుక్రవారం ముగిసింది.
ఈ ప్రక్రియలో 7,242 సీట్లు భర్తీ కాగా 845 సీట్లు మిగిలిపోయాయి. బీఫార్మసీలో 6,172, ఫార్మ-డి(బైపీసీ స్టీమ్)లో 1,060 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 18 లోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయకపోతే కేటాయింపులు రద్దవుతాయని ఏపీ ఎంసెట్-2015 కన్వీనర్ బి. ఉదయలక్ష్మి తెలిపారు. ఈ నెల 19, 20 తేదిల్లో ఎంసెట్ తుది విడత కౌన్సిలింగ్‌ని చేపట్టనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 15 Aug 2015 01:09PM