ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్‌లో 100 శాతం సీట్లు భర్తీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఫార్మసీ, ఫార్మ్-డి, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్‌లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
సీట్ల కేటాయింపును ప్రవేశాల క్యాంపు కార్యాలయం బుధవారం ప్రకటించింది. రాష్ట్రంలోని 116 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని 2,609 సీట్లు అందుబాటులో ఉండగా, అవన్నీ భర్తీ అయ్యాయని పేర్కొంది. సీట్లు పొందిన విద్యార్థులు 25వ తేదీలోగా ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని పేర్కొంది. 26వ తేదీలోగా కాలేజీల్లో చేరాలని సూచించింది.
Published date : 21 Jul 2016 01:14PM