Skip to main content

ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలపై అవగాహన కార్యక్రమాలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 16వ తేదీ నుంచి 25 వరకు వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎంసెట్ కమిటీ నిర్ణయించినట్లు కన్వీనర్ యాదయ్య తెలిపారు.
ఇంజనీరింగ్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలు మే 3, 4, 6వ తేదీల్లో, అగ్రికల్చర్ పరీక్షలు 8, 9 తేదీల్లో ఉంటాయని పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. ఏప్రిల్ 16న మెదక్ జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీ, 17న వరంగల్‌లోని వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 18న ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, 19న నల్లగొండలోని స్వామి రామానందతీర్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 20న ఖమ్మంలోని స్వర్ణ భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అనుబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 22న నిజామాబాద్‌లోని విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీ, 23న ఆదిలాబాద్‌లోని నలంద డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, మహబూబ్‌నగర్‌లోని జయప్రకాశ్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 25న కరీంనగర్‌లోని శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
Published date : 15 Apr 2019 01:36PM

Photo Stories