Skip to main content

ఎంసెట్-3 కి ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరి

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): మెడికల్ కౌన్సెలింగ్‌లో పాల్గొనదలచిన అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో మాత్రమే పరిశీలనకు హాజరుకావాలని తెలంగాణ అధికారులు బుధవారం తేల్చిచెప్పడంతో ఏపీలోని బి-కేటగిరీ సీట్లు తీసుకున్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.
కస్టోడియన్ సర్టిఫికెట్ అనుమతించబోమని తెలంగాణ అధికారుల నుంచి ప్రకటన వెలువడగానే బి-కేటగిరీ సీట్లు పొందిన అభ్యర్థులు ప్రైవేటు కళాశాలల అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ జయరమేష్‌ను కలిసి తమకు సర్టిఫికెట్లు ఇవ్వాలనికోరగా ఆయన కుదరదని చెప్పారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజును కూడా కలిసినా ఫలితం లేకపోయింది. ఏపీలో ఎ- కేటగిరీ కౌన్సెలింగ్, తెలంగాణ ఎంసెట్ నిర్వహించకుండానే ప్రైవేటు యాజమాన్యాలకు లాభం చేకుర్చాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కావాలనే అభ్యర్థులను బి-కేటగిరీ సీట్లు తీసుకునేలా ప్రేరేపించిందని అభ్యర్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు..
Published date : 15 Sep 2016 03:40PM

Photo Stories