ఎంసెట్-2 నిందిత విద్యార్థులు ఎంసెట్-3 రాయొచ్చు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ ఎంసెట్-3 రాసేందుకు అర్హులేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ‘‘నిందితులైన విద్యార్థులపై అభియోగాలు 100% నిర్ధారణయితే తప్ప వారిపై చర్యలకు అవకాశం లేదు.
వారు కూడా పరీక్ష రాసే వీలుంటుంది. దోషులని విచారణలో తేలితే, వారిపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది నిర్ణయిస్తాం. ఎంసెట్-2 పేపర్ లీకేజీ బాధ్యులపై సీఎం కేసీఆర్ చర్యలు చేపడతారు’’ అని వివరించారు. మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), గురుకులాల్లో నాణ్యత ప్రమాణాలపై బుధవారం సమీక్ష అనంతరం విలేకరులకు ఆయన ఈ మేరకు వివరించారు.
Published date : 04 Aug 2016 03:25PM