Skip to main content

ఎంసెట్-1, ఏపీ ఎంసెట్ ప్రశ్నపత్రాలు కూడా లీక్?

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్-1తోపాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ ప్రశ్నపత్రం కూడా లీకైనట్లు సీఐడీ అధికారులు తమ విచారణలో గుర్తించినట్లుగా సమాచారం.
ఎంసెట్-2 లీకేజీపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు.. పలువురు కీలక వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ కావడానికి కారకులైన వారే ఎంసెట్-1, ఏపీ ఎంసెట్ ప్రశ్నపత్రాలను కూడా లీక్ చేసినట్లుగా వెల్లడైనట్లు తెలిసింది. ఈ అంశాలను పోలీసు ఉన్నతాధికారులు ఏపీ ప్రభుత్వానికి చేరవేసినట్లు సమాచారం. దీంతో ఏపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద అక్కడి మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ తేదీలను మార్చింది. ప్రస్తుతానికి వెబ్ ఆప్షన్ల తేదీలను పొడిగించినా.. తదుపరి విచారణలో వెలుగు చూసే అంశాలను బట్టి ఆ పరీక్షను రద్దు చేయాలా, లేదా అన్నదానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు ఎంసెట్-1 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ ప్రారంభించింది. ఒకటి రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన వివరాలు బయటపెట్టే అవకాశముంది.
Published date : 28 Jul 2016 02:26PM

Photo Stories