EAPCET: ఈఏపీ సెట్ అడ్మిషన్ల ఫీజు చెల్లింపు గడువు తేదీలు
Sakshi Education
ఏపీ ఈఏపీ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు గడువు అక్టోబర్ 30 వరకు ఉందని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, అడ్మిషన్ల కౌన్సెలింగ్ కన్వీనర్ పోలా భాస్కర్ పేర్కొన్నారు.
అడ్మిషన్ల వెబ్ కౌన్సెలింగ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు కోసం చాలామంది విద్యార్థులు ఇంటర్నెట్ కేంద్రాలను సంప్రదిస్తున్నారని, అక్కడ రద్దీ కారణంగా అభ్యర్థులు, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు డేటా నమోదులో పొరపాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఫీజు చెల్లింపు అక్టోబర్ 30 వరకు ఉన్నందున నమోదు, ఇతర కార్యకలాపాల కోసం విద్యార్థులు తొందరపడవద్దని సూచించారు. డేటా నమోదు, సర్టిఫికెట్ల అప్లోడింగ్ సందర్భంగా తప్పులు జరగకుండా అభ్యర్థులు చూసుకోవాలన్నారు. అభ్యర్థులు తాము అప్లోడ్ చేసిన డేటాలో ఎటువం టి మార్పు అవసరం లేని పక్షంలో హెల్ప్లైన్ కేంద్రాలను సంప్రదించాల్సిన అవసరం లేదని, వివరాలను మార్చాల్సి వస్తే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఎంచుకున్న హెల్ప్లైన్ సెంటర్ను సంప్రదించవచ్చని వివరించారు.
చదవండి:
Published date : 27 Oct 2021 03:13PM