AP EAPCET 2022 Web Options Postponed : వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే..!
కొన్ని అనివార్యా కారణాల వల్ల ఏపీ AP EAPCET–2022 వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఆగస్టు 28వ తేదీన వాయిదా వేశారు. త్వరలోనే వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు, రిపోర్టింగ్ తేదీలను ప్రకటిస్తామని ఏపీ ఈఏపీసెట్ కన్వీనర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను సెప్టెంబర్ 5వ తేదీ వరకు పొడిగించారు.
Best Engineering Branch: బీటెక్... కాలేజ్, బ్రాంచ్ ఎంపిక ఎలా
ఏవైనా విద్యార్థులకు సమస్యలు తలెత్తితే..
వెబ్ కౌన్సెలింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా 25 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. విద్యార్థులకు సమస్యలు తలెత్తితే కన్వీనర్ కార్యాలయాన్ని ‘కన్వీనర్ APEAPCET 2022 ఎట్ ద రేట్ జీమెయిల్.కామ్’ ద్వారా సంప్రదించవచ్చు. లేదా 7995681678, 7995865456 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మొత్తం 1,94,752 మంది విద్యార్థులు APEAPCET 2022కు హాజరుకాగా.. 1,73,572 మంది ఉత్తీర్ణులయ్యారు. పూర్తి వివరాలకు https://sche.ap.gov.in/APSCHEHome.aspxలో చూడొచ్చు.