ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌కు 2.86 లక్షల దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్‌కు అపరాధ రుసుము లేకుండా చివరి గడువు గురువారంతో ముగిసింది.
గడువు ముగిసే సమయానికి 2,86,093 మంది దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజనీరింగ్‌కు 1,85,190మంది, అగ్రికల్చర్, మెడికల్‌కు 1,00,903 మంది దరఖాస్తులు అందించారు. గతేడాది ఎంసెట్‌కు 2,55,413 మంది దరఖాస్తు చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 30,680 మంది అభ్యర్థులు పెరిగారు. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ ఏడాది ఏపీ ఎంసెట్‌కు గణనీయ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
Published date : 25 Mar 2016 12:32PM