ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ తుది విడత ర్యాంకుల విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్/ కాకినాడ: ఏపీ ఎంసెట్-2016కు సంబంధించి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ర్యాంకులు ఖరారు చేస్తూ తుదివిడత ర్యాంకులను కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు బుధవారం జేఎన్‌టీయూకేలో విడుదల చేశారు.
ర్యాంకుల సమాచారాన్ని విద్యార్థుల ఫోన్లకు సంక్షిప్త సందేశ రూపంలో పంపించారు. ర్యాంకు కార్డులను గురువారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మొదటి దశలో ఇంజనీరింగ్‌లో 1,34,147 ర్యాంకులు, అగ్రి, మెడికల్ విభాగంలో 87,890 కలిపి మొత్తం 2,22,037 ర్యాంకులు ప్రకటించామన్నారు. ఇపుడు తుది విడతలో ఇంజనీరింగ్‌లో 6,240, అగ్రి మెడికల్ విభాగంలో 2,855 ర్యాంకుల్ని ప్రకటించామన్నారు.
Published date : 07 Jul 2016 05:43PM