Skip to main content

ఆంధ్రప్రదేశ్‌లో 3 నుంచి ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016, ఏపీ పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఖరారయ్యాయి.
ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 6 నుంచి ప్రారంభమవుతుంది. ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 29న, పీజీ సెట్ నోటిఫికేషన్‌ను మార్చి 4న విడుదల చేయనున్నారు. ఏపీ ఎంసెట్, పీజీ సెట్ కమిటీల మొదటి సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. ఎంసెట్ సిలబస్, కొత్తగా రీజినల్ సెంటర్ల కేటాయింపు, కొన్ని రీజినల్ సెంటర్ల తొలగింపు, ప్రవేశ పరీక్ష రుసుము పెంపు, బడ్జెట్ ఆమోదం తదితర అంశాలను కన్వీనర్ సీహెచ్ సాయిబాబు సమావేశంలో సభ్యుల ఆమోదం కోసం ప్రతిపాదించారు. వీటన్నింటికీ కమిటీ ఆమోదం తెలిపింది.

పరీక్ష రుసుముల పెంపు :
ఎంసెట్, పీజీ సెట్ పరీక్ష రుసుములను పెంచారు. ఎంసెట్ ఫీజు గతంలో రూ.250 ఉండగా.. ఈసారి రూ.350కి పెంచారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పీజీ సెట్ ఫీజు గతంలో రూ.500 ఉండగా.. ఈసారి రూ.600కు పెంచారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి.

పరీక్ష గత ఏడాదిలాగే... :
ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులకు 48 రోజులపాటు గడువు ఇవ్వనున్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే దాఖలు చేయాలని కన్వీనర్ సాయిబాబు స్పష్టంచేశారు. దరఖాస్తు, ఇతర నియమ నిబంధనలను www.apeamcet.org వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నామని చెప్పారు. ఒక దరఖాస్తు ఒక్కసారే ఆన్‌లైన్‌లో ఆమోదం పొందుతుందని, ఈ విషయాన్ని అభ్యర్ధులు గమనించి వివరాలను సరిచూసుకొని అప్‌లోడ్ చేయాలని సూచించారు. దరఖాస్తు ఫీజును ఏపీ ఆన్‌లైన్, టీఎస్ ఆన్‌లైన్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, క్రెడిట్, డెబిట్ మాస్ట్రో కార్డుల ద్వారా చెల్లించవచ్చని వివరించారు. పరీక్ష నమూనా గత ఏడాది మాదిరిగానే ఉంటుందన్నారు.

ఏప్రిల్ 29న ఎంసెట్ :
ఏపీ ఎంసెట్‌కు ఈసారి 2.70 లక్షల మంది దరఖాస్తు చే యవచ్చని అంచనా వేస్తున్నామని సాయిబాబు తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి హాల్‌టిక్కెట్లు జారీ చేస్తామన్నారు. వీటిని ఎపీ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఎంసెట్‌ను ఏప్రిల్ 29న నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలను హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మాల్‌ప్రాక్టీస్ జరగకుండా పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సాయిబాబు తెలిపారు.

ఆన్‌లైన్‌లో పీజీ సెట్ నిర్వహణపై కమిటీ :
ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్‌ను మార్చి 4న విడుదల చేయనున్నారు. మార్చి 6 నుంచి ఏప్రిల్ 20 వరకు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈసారి పీజీ సెట్‌ను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలన్న అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. కొందరు సభ్యులు దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపై అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకోవడానికి కాకినాడ జేఎన్‌టీయూ వీసీ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

షెడ్యూల్ ప్రకారం ఎంసెట్, పీజీ సెట్ల ప్రక్రియలు :

ప్రక్రియ

ఎంసెట్

పీజీ సెట్

నోటిఫికేషన్

జనవరి 29

మార్చి 4

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ

ఫిబ్రవరి 3

మార్చి 6

అపరాధ రుసుము లేకుండా చివరి తేదీ

మార్చి 21

ఏప్రిల్ 20

రూ.500 రుసుముతో చివరి తేదీ

ఏప్రిల్ 2

ఏప్రిల్ 30

రూ.1,000తో(ఎంసెట్), రూ.2 వేల రుసుముతో(పీజీసెట్) చివరి తేదీ

ఏప్రిల్ 11

మే11

రూ.5 వేల రుసుముతో చివరి తేదీ

ఏప్రిల్ 19

మే 18

హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్

ఏప్రిల్ 21-27

మే 19-మే 21

రూ.10 వేల రుసుముతో దరఖాస్తు తేదీ

ఏప్రిల్ 27

మే 21

పరీక్ష ఏప్రిల్ 29

మే 25-27

---

ప్రిలిమినరీ కీ విడుదల

మే 1

---

ర్యాంకుల విడుదల

మే 16

జూన్ 10

Published date : 28 Jan 2016 10:53AM

Photo Stories