Skip to main content

అక్టోబర్ 6న ఎంసెట్ ఫలితాలు:కరోనా కారణంగా ఎంసెట్ రాయని వారికి 3న పరీక్ష

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలను అక్టోబర్ 6వ తేదీన విడుదల చేసేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది.
వాస్తవానికి 3వ తేదీనే ఫలితాలను విడుదల చేయాలని భావించింది. అయితే ఈనెల 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంసెట్‌కు కరోనా కారణంగా హాజరు కాలేక పోయిన 54 మంది విద్యార్థులకు, ఈసెట్ రాయలేకపోయిన మరో నలుగురు విద్యార్థు లకు అక్టోబర్ 3న పరీక్షలు నిర్వహి స్తోంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫె సర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడిం చారు. ఇక అక్టోబర్ 5వ తేదీన ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలను విడుదల చేయాలని భావించినా, అదే రోజు జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో 6వ తేదీన ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలను విడు దల చేయనున్నారు. ఇక అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. సోమ, మంగళవారాల్లో ఈ పరీక్షలను నాలుగు విడ తలో ఎంసెట్ కమిటీ నిర్వహించింది. వీటికి సంబంధించిన జవాబుల ప్రాథమిక కీలను రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది.

Candidates can check TS EAMCET 2020 results in www.sakshieducation.com
Published date : 30 Sep 2020 12:56PM

Photo Stories