5న ఎంపీసీ కోర్సుల రైతు కోటా కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో రైతు కోటా కౌన్సెలింగ్ ఈ నెల 5న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో 22 సీట్లు, ఫుడ్ టెక్నాలజీలో 14 సీట్లకుగాను కౌన్సెలింగ్ ఉంటుందని, పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో చూడవచ్చని అధికారులు తెలిపారు.
Published date : 04 Aug 2016 03:32PM