28 నుంచి తెలంగాణ ఎంసెట్ దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ కోసం విద్యార్థులు ఈనెల 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ మేరకు బుధవారం ఎంసెట్ నోటిఫికేషన్‌ను కన్వీనర్ రమణారావు విడుదల చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తుల విధానం, సిలబస్, కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలను www.tseamcet.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొన్నారు. అపరాధ రుసుము లేకుండా ఈనెల 28 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
Published date : 26 Feb 2015 02:18PM