27 నుంచి ఏపీలో ఎంసెట్ కౌన్సెలింగ్
Sakshi Education
జూన్ 6 నుంచి 15 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
9 నుంచి 18 వరకూ వెబ్ ఆప్షన్లు
22న సీట్లు కేటాయింపు, 27 నుంచి తరగతులు
ఏపీ ఓపెన్ స్కూలు ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. జూన్ 6 నుంచి 15 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. జూన్ 9 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుందని, 19, 20 తేదీల్లో ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని మంత్రి వెల్లడించారు. జూన్ 22న సీట్లు కేటాయిస్తామని, జూన్ 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. విజయవాడలో గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూలు సొసైటీ ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాలయాలను ఆకస్మిక తనిఖీలు చేస్తామని, నిబంధనలు పాటించని వాటి గుర్తింపు రద్దుచేస్తామని స్పష్టం చేశారు. ఈ తనిఖీలకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని, తనతోపాటు, విద్యాశాఖ కమిషనర్, డెరైక్టర్ కూడా ఆకస్మిక తనిఖీలు చేపడతారని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీలకు గ్రేడింగ్ విధానం ప్రవేశపెడతామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అక్రమాలకు చెక్‌పెట్టేందుకు బయోమెట్రిక్ సిస్టమ్‌ను అమలు చేస్తామన్నారు. ప్రతీ కాలేజీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పెట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోకుండా అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. రాష్ర్టంలోని కేంద్ర విద్యా సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరామన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. అమరావతి, తిరుపతి, వైజాగ్‌లో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటుచేస్తామన్నారు. వీటికి సంబంధించిన అనుమతులు, భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోందని గంటా వివరించారు.
పటిష్టంగా వయోజన విద్య..
రాష్ట్రంలో 2015-16 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూలు సొసైటీ పరీక్షల్లో 1,06,454 మంది ఉత్తీర్ణులయ్యారని, వారిలో ఎస్‌ఎస్‌సీ 52,635, ఇంటర్ 53,819 మంది ఉన్నారని మంత్రి వివరించారు. 14 ఏళ్లు నిండి చదువు ఆపేసిన వారు ఈ ఓపెన్ స్కూల్ విధానంలో చదువుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించేందుకు వయోజన విద్య, ఓపెన్ స్కూలు పద్ధతులను పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి అవసరమైన సిలబస్, పరీక్షా విధానంపై కసరత్తు చేయడం జరుగుతుందన్నారు. మీడియా సమావేశంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా, విద్యాశాఖ కమిషనర్ సుధారాణి పాల్గొన్నారు.

Published date : 27 May 2016 05:54PM