17లోగా ఏపీ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవాలి
Sakshi Education
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఎంసెట్‌కు ఈ నెల 17లోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ డాక్టర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు.
కాకినాడలోని జేఎన్‌టీయూలో ఈనెల 14న ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటివరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాల్లో 2,04,386 దరఖాస్తులు వచ్చాయన్నారు. మార్చి 26 వరకూ రూ.500, ఏప్రిల్ 10 వరకు రూ.1000, ఏప్రిల్ 17 వరకు రూ.5 వేలు, 22కు రూ.10 వేల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తు చేసుకున్నవారు ఏప్రిల్ 19 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఇంజనీరింగ్ పరీక్ష ఏప్రిల్ 24, 25, 26, 27 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అలాగే, అగ్రికల్చర్, బీఫార్మసీ, డీఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్ వంటి కోర్సులకు 28న, రెండు విభాగాలకూ హాజరయ్యే అభ్యర్థులకు ఆయా తేదీల ప్రకారం పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈసారి పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న నేపథ్యంలో.. జిల్లాకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో మౌలాలీ, నాచారం, హయత్‌నగర్ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంసెట్‌కు సంబంధించి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి 0884-2340535 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సాయిబాబు కోరారు.
Published date : 15 Mar 2017 02:54PM