15 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ నోటిఫికేషన్ జారీ అయింది. బుధవారం (15వ తేదీ) నుంచి విద్యార్థులు ఆన్‌లైన్లో (www.eamcet.tsche.ac.in) దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే ఎంసెట్ వెబ్‌సైట్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఆయుష్ కోర్సులకు సంబంధించి రాతపూర్వకంగా స్పష్టత రాకపోవడంతో ఈనెల 13న వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేలేదు. 15 నాటికి రాతపూర్వకంగా స్పష్టత వస్తే ఆయుష్ కోర్సులను తొలగించి, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సులకు దరఖాస్తులను స్వీకరిస్తారు. లేదంటే ఆయుష్ సహా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు స్వీకరిస్తారు. విద్యార్థులు మాత్రం 15వ తేదీ నుంచి ఏప్రిల్ 15 దాకా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.250, ఇతరులకు రూ.500. రెండు పరీక్షలకు హాజరయేందుకు ఎస్సీ, ఎస్టీలు రూ.500, ఇతరులు రూ.1,000 చెల్లించాలి. ఎంసెట్ పరీక్ష మే 12న ఉంటుంది.
Published date : 14 Mar 2017 02:27PM