14, 15 తేదీల్లో తెలంగాణ ఎం-సెట్ కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రైవేటు వైద్య, దంత వైద్య కళాశాలల నేతృత్వంలో జరిగిన ప్రత్యేక వైద్య ప్రవేశ పరీక్ష (ఎం-సెట్)లో అర్హత సాధించిన వారికి ఆయా కాలేజీల్లోని 35 శాతం యాజమాన్య సీట్లకు ఆగస్టు 14, 15 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ రవిరాజు చెప్పారు.
అయితే ఇంకా కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేయాల్సి ఉందన్నారు. జేఎన్‌టీయూలో బుధవారం ప్రారంభమైన మెడికల్ కౌన్సెలింగ్ పర్యవేక్షణకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు మెడికల్ కౌన్సెలింగ్ వచ్చే నెల 12, 13 తేదీల్లో జరుగుతుందని పేర్కొన్నారు.
Published date : 30 Jul 2015 02:11PM