Skip to main content

Increase the Number of Posts in DSC: డీఎస్సీలో పోస్టులు పెంచాలని ఆందోళన

ఆదిలాబాద్‌ టౌన్‌: ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేస్తూ బీఎడ్‌, డీఎడ్‌ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు.
BED and DED Candidates Rally for More Vacancies   Increase the number of posts in DSC   Protesters Demand Increase in Mega DSC Posts

జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాల యం ఎదుట మార్చి 1న‌ ఆందోళనకు దిగారు. విద్యాశాఖ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఖాళీలు ఉన్నప్పటికీ పోస్టులు చూపించలేక పోవడంతో తమకు అన్యాయం జరుగుతుంద ని పేర్కొన్నారు.

పోస్టుల సంఖ్య పెంచితే నిరుద్యోగ అభ్యర్థులతో పాటు సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో వారు డీఈవోతో వాగ్వాదానికి దిగారు.

చదవండి: డీఎస్సీ - టెట్‌ | మోడల్ పేపర్స్ | సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్ | స్కూల్ అసిస్టెంట్ బిట్ బ్యాంక్

ఇతర జిల్లాల్లో గత నోటిఫికేషన్‌కు, ప్రస్తుత నోటిఫికేషన్‌కు వందలాది సంఖ్యలో పోస్టులు పెరగగా, జిల్లాలో కేవలం 48మాత్రమే పెరిగాయని, ఎస్జీటీలో కేవలం ఒక పోస్టు మాత్రమే పెరిగిందన్నారు. అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

>> TS Mega DSC 2024: రాష్ట్ర స్థాయిలో డీఎస్సీ ప్రక్రియ.. ప్రశ్నల తయారీ ఇలా.. పాస్‌వర్డ్స్‌ అన్నీ వీరి పర్యవేక్షణలో..

>> TS DSC 2024 District Wise Posts Details : జిల్లాల వారీగా 11062 టీచర్ల‌ పోస్టుల ఖాళీల వివరాలు ఇవే.. ముఖ్య‌మైన తేదీలు ఇలా..

Published date : 02 Mar 2024 05:37PM

Photo Stories