Skip to main content

ఓపెన్ స్కూల్ ద్వారా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లోడిప్లొమా

సాక్షి, హైదరాబాద్: జాతీయ ఓపెన్ స్కూల్(ఎన్‌ఐఓఎస్) ద్వారా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా కోర్సును దూరవిద్య ద్వారా పొందే అవకాశం ఉందని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జి.కిషన్ సెప్టెంబర్ 9న ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీ.ఈఎల్.ఈడీ) శిక్షణ పొంది ఉండాలన్నారు. శిక్షణ పొందని వారుంటే 31 మార్చి, 2019లోగా శిక్షణ పొందాలన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దూరవిద్య ద్వారా శిక్షణ కార్యక్రమం చేపట్టిందని, ఆసక్తి గల వారు సెప్టెంబర్ 15లోగా www.nios.ac.in లేదా dled@nios.ac.in ద్వారా నమోదు చేసుకోవాలన్నారు.
Published date : 11 Sep 2017 02:49PM

Photo Stories