నాగార్జున వర్సిటీ ‘దూరవిద్య’కు దరఖాస్తులు
Sakshi Education
హైదరాబాద్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యలో భాగంగా బీఎస్సీ, బీకాం, బీహెచ్‌ఎం, బీఎఫ్‌టీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్ పాస్/ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నారాయణగూడలోని జాగృతి కాలేజ్ స్టడీ సెంటర్ డెరైక్టర్ జైపాల్‌రెడ్డి, కో ఆర్డినేటర్ కిశోర్‌రెడ్డి తెలిపారు.
2016, మే బ్యాచ్‌లో పరీక్షలు రాయడానికి ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ, లైబ్రరీ సైన్స్ పీజీ డిప్లొమా కోర్సుల కోసం డిగ్రీ పూర్తి చేసిన వారికి అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రకటించారు. వివరాలకు 9849144925, 9550975288 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Published date : 23 Dec 2015 02:37PM