మార్చి 10న ఇగ్నో ఎంబీఏ ప్రవేశ పరీక్ష
Sakshi Education
హైదరాబాద్: ఇగ్నో (ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం)-2019 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రవేశ పరీక్షను మార్చి 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ ఎస్.ఫయాజ్ అహ్మద్ తెలిపారు.
బషీర్‌బాగ్, నిజాం కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. హాల్‌టికెట్‌లను ఇగ్నో వెబ్‌సైట్ www.ignou.ac.in లో పొందుపరిచామని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కంట్రోల్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలు వస్తే 9492451812 లో సంప్రదించగలరని పేర్కొన్నారు.
Published date : 07 Mar 2019 01:35PM