ఏప్రిల్ 19న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ అర్హత పరీక్ష
Sakshi Education
లాలాపేట: బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో (బీఏ, బీకాం, బీఎస్సీ) చేరడానికి ఏప్రిల్ 19న రాష్ట్రవ్యాప్తంగా అర్హత పరీక్ష నిర్వహించనుంది.
ఈ మేరకు యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిలర్ వెల్‌ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దునుకు వేలాద్రి, డా.పర్వతం వెంకటేశ్వర్లు, డా.బాల్‌రెడ్డి, సాయిబాబా, సత్యానందం తదితరులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎటువంటి విద్యార్హత లేకపోయినా ఈ సంవత్సరం జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులందరూ ఈ పరీక్ష రాయవచ్చన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లలో ఈ పరీక్షకు సంబంధించిన సమాచారం, మోడల్ పేపర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా ఏప్రిల్ 4 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9959850497, 9000729590 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
Published date : 24 Mar 2020 03:21PM