Skip to main content

ఏఎన్‌యూ దూరవిద్య ఫలితాలు విడుదల

ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం గతేడాది డిసెంబర్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎమ్మెస్సీ ఐటీ, ఎమ్మెస్సీ కోర్సుల ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు, ఎంసీఏ కోర్సు మొదటి, రెండు, మూడో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఈనెల 5న విడుదల చేసినట్లు దూరవిద్య పీజీ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ ఆంజనేయరెడ్డి తెలిపారు.
ఫలితాలను www.anucde.info వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని చెప్పారు. రీవాల్యుయేన్ ఫీజు చెల్లించేందుకు ఈనెల 20 ఆఖరు తేదీగా నిర్ణయించామన్నారు. ఇందుకు ఒక్కో పేపర్‌కు రూ.960 చొప్పున ఫీజు చెల్లించాలని తెలిపారు.

డిగ్రీ ఫలితాలు విడుదల: ఏఎన్‌యూ దూరవిద్య కేంద్రం గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన బీఏ, బీకాం, బీబీఎం, బీహెచ్‌ఎం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్సీ (ఐటీ) కోర్సుల మొదటి, రెండు, మూడో సంవత్సరాల పరీక్ష ఫలితాలను ఈనెల 5న విడుదల చేశామని దూరవిద్య డిగ్రీ పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ బి.సత్యవతి తెలిపారు. ఫలితాలను వర్సీటీ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చన్నారు. రీవాల్యుయేషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 15 ఆఖరు తేదీ. ఇందుకు ఒక్కో పేపర్‌కు రూ.770 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు.
Published date : 06 Feb 2017 02:59PM

Photo Stories