ఏఎన్‌యూ దూరవిద్య పరీక్ష ఫీజు షెడ్యూలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం మే నెలలో నిర్వహించనున్న పీజీ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ జి.జాన్సన్ తెలిపారు.
పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 6వ తేదీని గడువుగా నిర్ణయించారు. 100 రూపాయల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 13వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. తత్కాల్ విధానంలో 500 రూపాయల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 17వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.
Published date : 24 Mar 2018 05:17PM