ఏఎన్‌యూ దూరవిద్య పీజీ ఫలితాలు విడుదల
Sakshi Education
గుంటూరు (ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రం ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎంఏ హిందీ, ఎమ్మెస్సీ ఐటీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఫుడ్ అండ్ న్యూట్రీషనల్ సెన్సైస్, సైకాలజీ కోర్సుల ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను బుధవారం విడుదల చేశారు.
ఫలితాలను www.anucde.info, www.anucde.com వెబ్‌సైట్‌ల ద్వారా పొందవచ్చు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 16 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ వివరాలను దూరవిద్య పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ డి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
Published date : 28 Jul 2016 02:27PM