అంబేడ్కర్ వర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో ప్రవేశాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రవేశాలు పొందాలనుకున్న అభ్యర్థులు వర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రిజస్ట్రేషన్లకు మార్చి 15 ఆఖరు తేదీ. ఫీజు రూ.200. అర్హత పరీక్షను ఏప్రిల్ 17న నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్/తత్సమాన కోర్సు ఫెయిలై జులై నాటికి 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. మరిన్ని వివరాలకు www.braouonline.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
Published date : 23 Jan 2016 02:03PM