అక్టోబర్ 19 నుంచి అంబేడ్కర్ వర్సిటీలో బీఈడీ అడ్మిషన్లు
Sakshi Education
సాక్షి, అమరావతి బ్యూరో: డా.బీఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో 2018-19 విద్యాసంవత్సరానికి బీఈడీ (స్పెషల్) అడ్మిషన్లు అక్టోబర్ 19 నుంచి ప్రారంభమవుతాయని వర్సిటీ విద్యార్థి సేవా విభాగం డెరైక్టర్ డా. పి.కృష్ణారావు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లోని 11 కేంద్రాల అడ్మిషన్లకు సంబంధించి హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అక్టోబర్ 17న ఒక ప్రకటనలో వెల్లడించారు. యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన అభ్యర్థులు మాత్రమే అడ్మిషన్‌కు అర్హులని పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హతకు సంబంధించిన అన్ని ధృవపత్రాలు ఒరిజనల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ ప్రతులు, అడ్మిషన్ ఫీజుతో రావాలని సూచించారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారి వివరాలు www.braouonline.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. బీఈడీలో మిగిలిపోయిన సీట్లకు అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని, వివిధ సబ్జెక్టుల్లో 60 సీట్లు ఖాళీగా ఉన్నాయని మిగిలిన వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.
Published date : 19 Oct 2018 02:28PM