22 వరకు ఏపీలో ‘అంబేడ్కర్’ అడ్మిషన్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2015-16 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందడానికి రూ. 200 అపరాధ రుసుంతో ఈ నెల 22 వరకు గడువుగా నిర్ణయించినట్లు వర్సిటీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంటర్, దానికి సమానమైన విద్యార్హత కలిగిన వారు, 2011 నుంచి 2015 మధ్య కాలంలో వర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్లు అడ్మిషన్లు పొందవచ్చు. అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తు పంపడంతో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి అయినట్లు భావించరాదని, సర్టిఫికెట్ల పరిశీలన, ఫీజు చెల్లింపు పూర్తి అయితేనే అడ్మిషన్ జరిగినట్లు భావించాలని పేర్కొంది. డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లతో పాటు రెండు, మూడు సంవత్సరాల ట్యూషన్ ఫీజు చెల్లించేందుకూ అనుమతిస్తున్నట్లు తెలిపింది. అలాగే పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు, రెండు, మూడో సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ. 200 అపరాధ రుసుంతో చెల్లిం చేందుకు కూడా 22 వరకు గడువు ఉన్నట్లు యూనివర్సిటీ తెలిపింది. మొదటి ఏడాది విద్యార్థులు మాత్రం తాము ఎంపిక చేసుకున్న అధ్యయన కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకుంటేనే ఫీజు చెల్లించే వీలుంటుంది.
Published date : 11 Jan 2016 01:52PM