Jobs in Indian Army: అగ్నివీర్ జీడీ మహిళా మిలిటరీ పోలీస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఈ నియామకాలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి(కరైకాల్, యానాం, పుదుచ్చేరి), అండమాన్ అండ్ నికోబార్, కేంద్ర పాలిత ప్రాంతాల జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులు. ఇందులో అర్హత సా«ధించిన వారికి శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపికచేస్తారు.
అర్హత: 45శాతం మార్కులతో పదో తరగతి/మెట్రిక్యులేషన్, ప్రతి సబ్జెక్టులో 33శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవర్ నియామకాల్లో లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 17 1/2 నుంచి 21ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 22.03.2024.
ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 22.04.2024.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/
చదవండి: Indian Army Recruitment 2024: ఏఆర్‌వో విశాఖపట్నం పరిధిలో అగ్నివీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్